Apr 9, 2020, 3:50 PM IST
తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్నవారికి ఉచిత బియ్యం పంపిణీ అనౌన్స్ చేయడంతో రేషన్ షాపుల దగ్గర జనాలు ఎగబడుతున్నారు. అయితే కరోనావైరస్ ప్రభావంతో వీరిని కట్టడి చేయడానికి అదే సమయంలో రేషన్ సక్రమంగా పంపిణీ చేయడానికి ఓ రేషన్ షాపు ఓనర్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నాడు. షాపు బయట బకెట్, నీళ్లు, సబ్బు ఏర్పాటు చేశాడు. చేతులు కడుక్కుని, మాస్కులు పెట్టుకుని లైన్లో వస్తేనే బియ్యం అంటూ రూల్స్ పెట్టాడు. దీనికోసం పోలీసుల సాయం కూడా తీసుకున్నాడు.