Apr 22, 2020, 10:24 AM IST
యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం ఇస్కిళ్ళ గ్రామ శివారులో దగ్ధం అవుతున్న పశువుల కొట్టం వద్ద అల్లాడుతున్న మూగజీవాలను రామన్నపేట పోలీసులు కాపాడారు. వివరాల ప్రకారం విధి నిర్వహణలో భాగంగా కక్కిరేణి నుండి రామన్నపేటకు వస్తున్న కానిస్టేబుల్ లు పంజాల యాదగిరి, కోమటి రెడ్డి రవీందర్ రెడ్డి లు సాహసాన్ని ప్రదర్శించి మూగజీవాలను కాపాడారు.