Aug 30, 2022, 5:03 PM IST
పెద్దపల్లి : సొంత పార్టీకి చెందిన రామగుండం మేయర్ పై అధికార టీఆర్ఎస్ కార్పోరేటర్లు తిరుగుబాటు ఎగరేసారు. రామగుండం నగరపాలక సమావేశంలో మేయర్ కు వ్యతిరేకంగా టీఆర్ఎస్ కార్పోరేటర్లు నిరసనకు దిగారు. తమ డివిజన్లలో సమస్యల గురించి ఎన్నిసార్లు మేయర్ కు మొరపెట్టుకున్నా లాభంలేకుండా పోయిందని... నిధులు మంజూరు చేయకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ కార్పోరేటర్లు ఆందోళనకు దిగారు. వీరికి కాంగ్రెస్, బిజెపి కార్పోరేటర్లు కూడా మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలోనే మేయర్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రతిపక్ష కార్పోరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. మేయర్ తీరుకు నిరసనగా అన్ని పార్టీల కార్పోరేటర్లు కౌన్సిల్ సమావేశానికి దూరంగా వున్నారు.