Aug 12, 2022, 1:38 PM IST
హైదరాబాద్ : సోదర సోదరీమణుల అనుబంధానికి, ఆప్యాయతానురాగాలకు ప్రతీక అయిన రాఖీపండగ తెలంగాణలో ఘనంగా జరుగుతోంది. సోదరులకే కాదు సోదర సమానులు, అండదండగా నితిచే వారికి ఆడపడుచులు రాఖీలు కడుతూ సోదరప్రేమను చాటుకుంటున్నారు. ఇలా తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు ఇంట రాఖీ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. మహిళలు భారీగా మంత్రి హరీష్ ఇంటికి చేరుకుని ఆయనకు రాఖీ కడుతున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి రాఖీపౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఇక మరోమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటివద్ద కూడా రాఖీ పండగ సందడి నెలకొంది. మంత్రి సోదరీమణులతో పాటు హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా రాఖీ కట్టారు. అలాగే టీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకులు, కార్యకర్తలు, సామాన్య మహిళలు మంత్రి తలసానికి రాఖీలు కట్టారు.