Jul 18, 2022, 3:50 PM IST
భారత రాష్ట్రపతి ఎన్నిక కోసం ఇవాళ (సోమవారం) దేశవ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా తెలంగాణ అసెంబ్లీలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో ముుఖ్యమంత్రి కేసీఆర్ ఓటుహక్కును వినియోగించుకున్నారు. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మంత్రి ప్రశాంత్ రెడ్డితో కలిసివచ్చి సీఎం కేసీఆర్ ఓటుహక్కును వినియోగించుకున్నారు. అంతకు ముందే మంత్రులు కేటీఆర్, హరీష్ రావు సహా మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు ఓటుహక్కును వినియోగించుకున్నారు.