Jul 18, 2022, 12:50 PM IST
భారత నూతన రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియలో అతి కీలకమైన పోలింగ్ ఇవాళ (సోమవారం) కొనసాగుతోంది. ఇందులో భాగంగా తెలంగాణ అసెంబ్లీలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యేలు ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణ భవన్ నుండి రాష్ట్ర టూరిజం బస్సుల్లో అసెంబ్లీకి బయలుదేరారు. ఇప్పటికే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మంత్రి కేటీఆర్ ఓటుహక్కును వినియోగించుకున్నారు. కొద్దిసేపట్లో సీఎం కేసీఆర్ కూడా అసెంబ్లీకి చేరుకుని ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.