Oct 27, 2022, 9:34 AM IST
తెలంగాణ : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బేరసారాలు జరపడానికి ప్రయత్నించిన కేసు సంచలనంగా మారింది. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో ఈ కేసు ప్రాధాన్యత సంతరించుకుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫాం హౌజ్ లో ఈ బేరసారాలు జరిగాయి. ఈ ఆపరేషన్ కోసం నిఘా, పోలీసు వర్గాలకు చెందిన దాదాపు 70 మంది ఈ 3 రోజులు పని చేశారు. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ తో పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో 74 సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేశారు. గంటన్నరపాటు సాగిన భేటీ ఈ కెమెరాల్లో రికార్డ్ అయింది.