Mar 1, 2022, 11:30 AM IST
హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో గుట్టుగా సాగుతున్న పేకాట దందా పోలీసుల దాడితో బట్టబయలయ్యింది. మాదాపూర్ లోని కాకతీయ హిల్స్ అపార్ట్ మెంట్ లో మహిళలు,పురుషులు కలిసి పేకాట ఆడుతుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రూ.90లక్షల నగదుతో పాటు ఖరీదైన మద్యం బాటిల్స్, మొబైల్ ఫోన్స్ ను ఎస్వోటీ పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. మొత్తం ఎనిమిది మందిని అరెస్ట్ చేయగా వీరిలో ముగ్గురు మహిళలు కూడా వున్నారు. అయితే అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే కూడా పోలీసులకు పట్టుబడగా రాజకీయ ఒత్తిళ్లతో అతన్ని తప్పించినట్లు ప్రచారం జరుగుతోంది.