మున్సిపాలిటీలను ఆదర్శవంతంగా మార్చాలి - మంత్రి కేటీఆర్ (వీడియో)

Sep 25, 2019, 6:16 PM IST

మేడ్చేల్ నియోజకవర్గ పరిధిలోని మున్సిపాలిటీలను ఆదర్శ మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. మంత్రి మల్లారెడ్డి విజ్జప్తి మేరకు మేడ్చేల్ నియోజకవర్గంలోని పది పురపాలికలపైన మసాబ్ ట్యాంకులోని మున్సిపల్ కాంప్లెక్స్ లో సమీక్ష నిర్వహించారు. ప్రజలు మున్సిపాలిటీల నుంచి కనీస సేవలను కోరుకుంటున్నారని, అందుకే పారిశుద్ద్యం, పార్కుల అభివృద్ది, మొక్కల పెంపకం, తాగునీటి సరఫరా వంటి కనీసం సేవలను మరింత మెరుగ్గా అందించేందకు కమీషనర్లు ప్రయత్నం చేయాలన్నారు. 


మున్సిపాలిటీల్లో ప్రజలకు మరింత వేగంగా సేవలు అందించే లక్ష్యంతో నూతన చట్టాన్ని తీసుకు వచ్చిందని, ఈ చట్టం ద్వారా ప్రజలకు కలిగే సౌకర్యాలు, అధికారుల భాద్యతపైన మరింత చైతన్యం తీసుకురావాలని కోరారు. ఈమేరకు ప్రతి మున్సిపాలిటీలోని అధికారులు, సిబ్బంది కోసం ప్రత్యేక అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలని కమీషనర్లను అదేశించారు. ఈ సమావేశంలో పురపాలక శాఖ డైరెక్టర్ శ్రీదేవి, జిల్లా కలెక్టర్ యంవి రెడ్డి, డిటిసిపి డైరెక్టర్ విధ్యాదర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.