Oct 31, 2022, 12:54 PM IST
పెద్దపల్లి : ఇటీవల హైదరాబాద్ లో మృతదేహానికి వైద్యం చేసిన కార్పోరేట్ హాస్పిటల్ నిర్వాకం మరువకముందే పెద్దపల్లి జిల్లాలో అలాంటి ఘటనే పెద్దపల్లి జిల్లాలో వెలుగుచూసింది. సుల్తానాబాద్ మండలం పూసల గ్రామానికి చెందిన మెరుగు లక్ష్మిని ప్రాణాపాయ స్థితిలో పెద్దపల్లి ప్రభుత్వాస్పత్రికి చేర్చారు కుటుంబసభ్యులు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతిచెందినా తమకు వైద్యులు తెలియజేయలేదని ... శవాన్ని మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించాలని డాక్టర్లు సూచించారంటూ ఆందోళన వ్యక్తం చేసారు. డాక్టర్ల నిర్లక్ష్యమే లక్ష్మి మృతికి కారణమంటూ బాధిత కుటుంబసభ్యులు, బంధువులు రాజీవ్ రహదారిపై ఆందోళనకు దిగారు. భాదిత కుటుంబం ఆందోళనతో రాజీవ్ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న పోలీసులు బాధిత కుటుంబాన్ని సముదాయించి ఆందోళనను విరమింపజేసారు.