పవన్ ఎంట్రీ: అసలు విషయం తెలిస్తే ఫాన్స్ కు పూనకాలే...

Jun 20, 2021, 2:00 PM IST

గత కొద్ది నెలలు గా పవన్ కళ్యాణ్ షూటింగ్ లకు దూరంగా ఉన్నారు. కోవిడ్ నుంచి కోలుకున్నా పబ్లిక్ లోకి రాలేదు. అయితే ఆయన తన షూటింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తెలంగాణాలో లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేయటంతో నిర్మాతలు షూటింగ్ లకు రెడీ అవుతున్నారు. ఈ నేపధ్యంలో పవన్ సైతం సాగర్ చంద్ర సినిమా షూట్ మొదలెట్టమని చెప్పారట. ఈ సినిమా మేజర్ పార్ట్ షూట్ హైదరాబాద్ అల్యూమినియం పాక్టరీలో జరిగింది. అక్కడ వేసిన స్పెషల్ సెట్ లో షూట్ చేసారు. ఇప్పుడు అక్కడ తిరిగి కంటిన్యూ చేయబోతున్నారు. అక్కడ పోలీస్ స్టేషన్ సెట్ లో సీన్స్ ఉండబోతున్నట్లు సమాచారం. జూలై రెండవ వారం నుంచి షూటింగ్ మొదలు కానుందని సమాచారం.