పుట్టినరోజు వేడుకలో విషాదం... కారు బావిలోకి దూసుకెళ్లి ఒకరు మృతి

Jul 17, 2022, 1:42 PM IST


జగిత్యాల జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీరాముల పల్లెలో స్నేహితుడి పుట్టినరోజు వేడుకలో పాల్గొని ఐదుగురు అర్థరాత్రి కారులో స్వస్థలానికి తిరిగివెళుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది.  జగిత్యాల పట్టణ సమీపంలోని లక్ష్మీపూర్ చిన్నగట్టు వద్ద కారు అదుపుతప్పి రోడ్డుపక్కనే వున్న బావిలోకి దూసుకెళ్ళింది. దీంతో మల్యాలకు చెందిన కిషోర్ మృతిచెందాడు. పుట్టినరోజు జరుపుకున్న చందుతో సహా మరో నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు.  

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఫైర్ సిబ్బంది, గ్రామస్తుల సహకారంతో సహాయక చర్యలు చేపట్టారు. భారీ క్రేన్ ను తీసుకువచ్చి రాత్రంతా శ్రమించగా తెల్లవారుజామున కారును వెలికితీసారు.  కిషోర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.