Aug 24, 2022, 1:29 PM IST
కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. హుజురాబాద్ మండలం తుమ్మలపల్లి వద్ద ఎదురెదురుగా వేగంగా వచ్చిన లారీ, డిసిఎం వ్యాన్ ఢీకొన్నాయి. ప్రమాదం తర్వాత డిసిఎం వ్యాన్ అదుపుతప్పి రోడ్డుపక్కన ఎస్సారెస్సీ కెనాల్ లోకి దూసుకెళ్లింది. దీంతో డిసిఎంలో ప్రయాణిస్తున్న స్టేషన్ ఘనపూర్ వాసి మృతిచెందాడు. మరో ఇద్దరు చిన్న చిన్న గాయాలతో ఈ ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడ్డారు. రెండు వాహనాల డ్రైవర్ల నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.