తెలంగాణలోనూ బాలయ్య ఫీవర్... 150 కార్లలో 'వీరసింహారెడ్డి' సినిమాకు

Jan 13, 2023, 10:53 AM IST

బోధన్ : నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన పక్కా యాక్షన్ మూవీ 'వీరసింహారెడ్డి' గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది. ఈ సందర్భంగా తెలుగురాష్ట్రాల్లో బాలయ్య ఫ్యాన్స్ సందడి మామూలుగా లేదు. ఆంధ్ర ప్రదేశ్ లో బాలయ్య అంటే పడిచచ్చే అభిమానులుంటారు... కాబట్టి అక్కడ వీరసింహారెడ్డి ఫీవర్ పీక్ లో వుండటం కామన్. కానీ తెలంగాణలోనూ బాలయ్యకు ఏ స్థాయిలో అభిమానులున్నారో నిజామాబాద్ జిల్లా బోధన్ లో పరిస్థితిని చూస్తే అర్థమవుతుంది. 

వీరసింహారెడ్డి సినిమా చూసేందుకు ఏకంగా 150 కార్లలో బోధన్ కమ్మసంఘం నాయకులు, యువత నిజామాబాద్ కు ర్యాలీగా బయలుదేరారు. ఇలా నిజామాబాద్ లోని ఉషా థియేటర్ కు కార్లతో క్యూ కట్టిన కమ్మసంఘం నేతలు సినిమా హాల్ లోనూ సందడి చేసారు. తమ అభిమాన నటుడి సినిమాను అందరం కలిసి చూద్దామనే కార్లతో ర్యాలీగా కలిసివెళ్లినట్లు కమ్మ సంఘం నాయకులు తెలిపారు.