Oct 17, 2022, 4:46 PM IST
నల్గొండ : మునుగోడు ఉపఎన్నిక ప్రచారాన్ని ప్రధాన పార్టీలన్ని ముమ్మరం చేసాయి. ఈ క్రమంలోనే బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మి, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ ఇవాళ(సోమవారం) చౌటుప్పల్ మండలం చిన్నకొండూరులో ప్రచారం చేపట్టారు. అయితే వీరి ప్రచారాన్ని గ్రామానికి చెందిన ఇతర పార్టీల నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, ఇతర పార్టీల నాయకులకు మధ్య వాగ్వాదం జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.