Oct 13, 2022, 11:56 AM IST
నల్గొండ : మునుగోడు ఉపఎన్నికకు నోటిఫికేషన్ వెలువడటంతోనే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అయితే అధికార టీఆర్ఎస్ తో పాటు ప్రతిపక్ష బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ఈ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ధన ప్రవాహంతో ఎక్కువగా వుండటమే కాదు మద్యం ఏరులైపారే అవకాశాలున్నాయి. వీటిని కట్టడి చేసేందుకు పోలీసులు, ఈసి ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఈ క్రమంలోనే బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా మునుగోడులో ప్రచారం కోసం వెళుతున్న ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కారును చౌటుప్పల్ గుడిమల్కాపూర్ చౌరస్తా వద్ద పోలీసులు ఆపి తనిఖీలు చేపట్టారు. ఈటల కూడా పోలీసులకు పూర్తిగా సహకరించారు.