Nov 3, 2022, 2:20 PM IST
నల్గొండ : మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ రోజున ఓ పార్టీ నాయకుడు డబ్బులతో పట్టుబడి తిరిగి పోలీసులనే దబాయిస్తున్న వీడియో బయటకు వచ్చింది. కొత్తగా నిర్మిస్తున్న ఇంట్లో ఓ పార్టీ నాయకుడు ఓటర్లను ప్రలోభపెట్టడానికి డబ్బులు పంచుతున్నట్లు సమాచారం అందుకుని అక్కడికి చేరుకున్నారు. అయితే పోలీసుల రాకను గుర్తించిన సదరు వ్యక్తం ఇంట్లోకి వెళ్లి నోట్లకట్టను దాచిపెట్టాడు. అయినప్పుడు పోలీసులు డబ్బులను గుర్తించగా తన ఇంట్లో ఎవరు డబ్బులు పెట్టారంటూ పోలీసులతోనే వాగ్వాదానికి దిగాడు.