దళిత బంధుతో కార్లు, ట్రాక్టర్లు... లబ్దిదారులకు అందించిన మంత్రులు గంగుల, కొప్పుల

Aug 26, 2021, 5:27 PM IST

కరీంనగర్: దళిత కుటుంబాలన్ని ఆర్థిక పురోగతి సాధించాలని ప్రభుత్వం దళిత బంధు పథకం తెచ్చిందని మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ అన్నారు. కరీంనగర్ కేంద్రంలో మంత్రుల చేతుల మీదుగా తెలంగాణా దళిత బంధు యూనిట్ లను పలువురు లబ్ధిదారులకు అందుకున్నారు. యూనిట్ ద్వారా కారు, ట్రాక్టర్ లు పొందటంపై లబ్ధిదారులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. నిన్నటి వరకు డ్రైవర్లుగా వున్న తాము నేడు ఓనర్లు అయ్యామని ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కు తాము జీవితాంతం రుణపడి ఉంటామని లబ్దిదారులు అన్నారు.