సీఎం కేసీఆర్ జగిత్యాల టూర్ ... భారీ బహిరంగ సభకు ముమ్మర ఏర్పాట్లు

Dec 5, 2022, 11:59 AM IST

జగిత్యాల : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన కోసం జగిత్యాల జిల్లాలో ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. డిసెంబర్ 7న (బుధవారం) ముఖ్యమంత్రి జగిత్యాల జిల్లాలో నూతనంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ భవన సముదాయంతో పాటు జిల్లా టీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అలాగే జగిత్యాల పట్టణంలో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ క్రమంలోనే బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్ పరిశీలించారు. సభకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని హరీష్ సూచించారు.