Aug 23, 2022, 2:35 PM IST
డిల్లీ లిక్కర్ స్కాం ఆరోపణలు, బిజెపి నాయకుల ఇంటిముట్టడి యత్నం నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు మద్దతుగా నిలిచారు. బంజారాహిల్స్ లోని కవిత నివాసానికి చేరుకున్న మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్ తో పటు ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, విద్యాసాగర్ రావు తదితరులు కవితతో మాట్లాడి సంఘీబావం తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ... తామంతా స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు కార్యాలయంలో వుండగా బిజెపి నాయకులు కవిత ఇంటిపైకి దాడికి రావడం దుర్మార్గమన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే తీవ్ర పరిణామాలుంటాయని బిజెపి నాయకులను మంత్రి హెచ్చరించారు. ఇప్పుడు బిజెపి కార్యాలయం ముట్టడికి వెళదామని టీఆర్ఎస్ కార్యకర్తలు అంటున్నారు... కానీ బాధ్యతాయుత నాయకులుగా మేం అలా చేయడంలేదన్నారు. బిజెపి నాయకుల ఇళ్లు, కార్యాలయాలపైకి లక్షలాది టీఆర్ఎస్ సైనికులు వెళితే పరిస్థితేంటి? అంటూ మంత్రి తలసాని బిజెపి నాయకులను హెచ్చరించారు.