మహంకాళి అమ్మవారి అంబారీ ఊరేగింపులో... మంత్రి తలసాని జోర్దార్ డ్యాన్స్ చూడండి...

Jul 18, 2022, 4:53 PM IST

హైదరాబాద్ : తెలంగాణలో బోనాలంటే ముందుగా గుర్తొచ్చేది సికింద్రాబాద్ మహంకాళి ఆలయం. ప్రతిఏటా ఆషాడమాసంలో జరిగే హైదరాబాద్ బోనాల వేడుకల్లో మహంకాళి బోనాలు హైలైట్ గా నిలుస్తాయి. ఈసారి కూడా సికింద్రాబాద్ బోనాలు ఘనంగా జరిగాయి. నిన్న(ఆదివారం) బోనాలతో ఆలయానికి వచ్చి అమ్మవారికి సమర్పించగా... నేడు (సోమవారం) భవిష్యవాణి, అంబారీ ఊరేగింపు జరిగాయి. మహంకాళి అమ్మవారిని ఏనుగుపై ఊరేగించారు. ఈ ఊరేగింపులో పాల్గొన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీన్మార్ స్టెప్పులతో అదరగొట్టారు.