Jun 8, 2022, 4:51 PM IST
దళితుల అభివృద్ధి కోసమే దళిత బంధు పథకాన్ని అమలుచేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అనాదిగా ఎంతో వెనుకబడిన దళితులు ఆర్థిక స్వావలంబన సాధించాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన... అందులోంచి పుట్టిందే దళిత బంధు అన్నారు. ఒకొక్క లబ్ధిదారుడికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించే ఇంత గొప్ప పథకం దేశంలో మరక్కడా లేదన్నారు. లబ్ధిదారులు ప్రభుత్వం అందించిన ఆర్ధిక సహాయాన్ని సద్వినియోగం చేసుకొని అభివృద్ధి సాధించాలని మంత్రి సూచించారు.
హైదరాబాద్ వెస్ట్ మారేడ్ పల్లిలో 28 మంది దళితబంధు లబ్ధిదారులకు మంత్రి తలసాని వాహనాలు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... గతంలో ఎవరైనా దళితుల అభివృద్ధి గురించి ఆలోచించారా? అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ హైదరాబాద్ కు చెందిన బిజెపి కార్పొరేటర్లను ఢిల్లీకి పిలిచి ఒట్టి చేతులతో పంపారు... కనీసం నగర అభివృద్ధి కోసం నిధులు ఇస్తే ప్రజలకు మేలు జరిగేదని మంత్రి తలసాని అన్నారు.