బోటెక్కి హుస్సేన్ సాగర్ లో చక్కర్లుకొడుతూ...గణేష్ నిమజ్జనాన్ని పరిశీలించిన మంత్రి తలసాని

Sep 9, 2022, 3:51 PM IST


హైదరాబాద్ : వినాయక విగ్రహాల నిమజ్జనం హైదరాబాద్ లో అట్టహాసంగా సాగుతోంది. ఇదివరకే హుస్సెన్ సాగర్ వద్ద నిమజ్జనం కోసం చేస్తున్న ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నగర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి.  తాజాగా వినాయక విగ్రహాల నిమజ్జన ప్రక్రియను కూడా పరిశీలించారు. హుస్సెన్ సాగర్ జలాశయంలో బోట్ పై ప్రయాణిస్తూ వినాయక విగ్రహాల నిమజ్జనాన్ని పర్యవేక్షించారు.