ఈతమొక్కలు నాటిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ (వీడియో)

Sep 27, 2019, 1:15 PM IST

మేడ్చెల్ మున్సిపాలిటీ పరిధిలోని అత్వేల్లి గ్రామంలో ఎస్సైజ్ శాఖ ఆధ్వర్యంలో హరితహారం లో భాగంగా మంత్రులు వి.శ్రీనివాస్ గౌడ్, మల్లా రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎం.వి రెడ్డిలు ఈత మొక్కలు నాటారు. 


గౌడ కులస్తుల కుల వృత్తి అయిన నీరా స్టాల్స్ ఏర్పాటు చేస్తాం అన్నందుకు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కిడ్నీల్లో రాళ్లను కరిగించడానికి నీరా మంచి ఔషధమని అన్నారు.  కుల వృత్తుల సంక్షేమం కోసం  సీఎం కేసీఆర్రూపొందించిన సంక్షేమ కార్యక్రమాల్లో ఇదీ ఓ భాగమని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం లో ఉన్నన్ని పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. నీరా వలన ఒక్క గౌడ కులానికి మాత్రమే ఉపాధి రాదని కుమ్మరి,కమ్మరి,వడ్రంగి కులాలకు కూడా ఉపయోగం ఉంటుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం లో కులవృత్తుదారులను అడుకోవడమే లక్ష్యంగా ముందుకు పోతున్నామని శ్రీనివాస్ గౌడ్ చెప్పారు.