Jun 14, 2020, 12:36 PM IST
పరిసరాల పరిశుభ్రతలో ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు మీకోసం అంటూ తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు, పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటిఆర్ గారు ఇచ్చిన పిలుపులో భాగంగా రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ నేడు మహబూబాబాద్ లోని తన నివాసంలో దోమలు నిల్వ ఉండే ప్రదేశాలను, ఇంటి ఆవరణలోని ప్రాంతాలను పరిశుభ్రం చేశారు.వానాకాలంలో డెంగ్యూ, చికెన్ గున్యా వంటి సీజనల్ వ్యాధుల తో పాటు కరోనా కూడా వ్యాప్తి చెందకుండా అందరూ విధిగా పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు.