Apr 17, 2022, 10:33 PM IST
ఖమ్మం లో బీజేపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్న నేపథ్యం లో మంత్రి పువ్వాడ అజయ్ పై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. మంత్రి పువ్వాడ అజయ్ ఓ సైకో అని, కేసీఆర్, కేటీఆర్ దగ్గర మార్కులు కొట్టడానికి పువ్వాడ ఓవర్ యాక్షన్ చేస్తున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. మూడేళ్లుగా ఖమ్మం లో పోలీసుల వేధింపులు ఎక్కువ అయ్యాయని పువ్వాడ కి కొందరు పోలీసులు చెంచాగిరి చేస్తున్నారని అయన తీవ్ర వ్యాఖ్యలు చేసారు. పువ్వాడ ను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని, కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసారు.