May 4, 2022, 5:34 PM IST
సిరిసిల్ల: ఐటీశాఖ మంత్రి కేటీఆర్ బుధవారం సొంత నియోజకవర్గం సిరిసిల్లలో పర్యటించారు. సిరిసిల్ల పట్టణంలోని విద్యుత్ సరఫరా సంస్థ (సెస్) నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాలకవర్గ సభ్యులకు మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. సిరిసిల్ల నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ది పనులను కేటీఆర్ ప్రారంభించారు. ఎల్లారెడ్డిపేట ప్రధాన కూడలిలో సుందరీకరణలో భాగంగా ఏర్పాటుచేసిన వాటర్ ఫౌంటెన్ ను కేటీఆర్ ప్రారంభించారు. అలాగే లవ్ ఎల్లారెడ్డిపేట ను కూడా ప్రారంభించారు. ఇక సిరిసిల్లలో జరిగిన పెళ్లిళ్లకు కూడా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇలా కేటీఆర్ సిరిసిల్లలో బిజీబిజీగా గడిపారు.