Jul 27, 2022, 5:44 PM IST
హైదరాబాద్ : తెలంగాణ ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ కాలి గాయంతో బాధపడుతూనే తన మంత్రిత్వ శాఖల పనులు చూసుకుంటున్నారు. తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో రాజధాని హైదరాబాద్ తో పాటు పలు పట్టణాల్లో పరిస్థితులపై మంత్రి ప్రగతి భవన్ నుండే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ జిహెచ్ఎంసి, జలమండలితో పాటు పురపాలక శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడిన మంత్రి పరిస్థితిని తెలుసుకున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి ప్రాణనష్టం జరక్కుండా చూడాలని అధికారులకు మంత్రి కేటీఆర్ సూచించారు.