కేటీఆర్ సిరిసిల్ల పర్యటనలో ఉద్రిక్తత... సెల్ టవర్ ఎక్కి కాంగ్రెస్ నాయకుల నిరసన

Jun 24, 2022, 2:25 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. కేటీఆర్ జిల్లా పర్యటనకు వచ్చిన ప్రతిసారి ఇలా నాయకులను ముందస్తు అరెస్టులు, నిర్భందం చేయడాన్ని నిరసిస్తూ తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలో సెల్ టవర్ ఎక్కి కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు. మంత్రి కేటీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సెల్ టవర్ పైనుండే నినాదాలు చేసారు. పోలీసులు వచ్చి నిరసనకారులను టవర్ పైనుండి కిందకు దించి అదుపులోకి తీసుకున్నారు.