యాదాద్రి ఆలయంలో అవమానంపై గవర్నర్ వ్యాఖ్యలు... దేవాదాయ మంత్రి కౌంటర్

Apr 8, 2022, 4:02 PM IST

నిర్మ‌ల్: తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర గవర్నర్ అయిన తనకు కనీస గౌరవం ఇవ్వకుండా అవమానిస్తున్నారంటూ తమిళ సౌందరరాజన్ వ్యాఖ్యలపై మంత్రి ఆలోల్ల ఇంద్రకరణ్ రెడ్డి స్పందించారు. గవర్నర్ కు ఎక్కడా అవమానం జరగలేదని... ఆమే తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టాలని చూస్తున్నారని అన్నారు. తాను తలుచుకుంటే అసెంబ్లీ రద్దయ్యేది అనే విధంగా పరిధి దాటి గవర్నర్ తమిళసై మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలదోసి ఆనాటి గవర్నర్ రాంలాల్ ఎంతటి ప్రజాగ్రహాన్ని చవిచూసారో అందరికీ తెలిసిందేనన్నారు.  యాదాద్రి ప‌ర్య‌ట‌న‌కు కేవలం 20 నిమిషాల ముందే రాజ్ భ‌వ‌న్ నుంచి సమాచారం అందిందని....  అయిన‌ప్ప‌టికీ యాదగిరిగుట్ట  చైర్మ‌న్  గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సైకి స్వాగ‌తం ప‌లికార‌న్నారు. గ‌తంలో బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షురాలుగా ప‌ని చేసిన‌ తమిళిసై తెలంగాణ గవర్నర్ గా కూడా బీజేపీకి అనుకూలంగానే వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆరోపించారు.