కోఠి హాస్పిటల్లో పేషెంట్స్ ముందే... మంత్రి హరీష్,ఎమ్మెల్యే రాజాసింగ్ మధ్య ఆసక్తికర చర్చ

May 6, 2022, 4:55 PM IST

హైదరాబాద్: తెలంగాణ ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్ రావు ఇవాళ(శుక్రవారం) కోఠిలోని ఈఎన్టీ ఆస్పత్రిని సందర్శించారు. మంత్రి వెంట స్థానిక బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా హాస్పిటల్ ను పరిశీలించేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి,  ఎమ్మెల్యేకు మధ్య ఆసక్తికర చర్చ సాగింది.హాస్పిటల్ లో అందుతున్న వైద్యం, ఇతర సౌకర్యాల గురించి చికిత్స పొందుతున్న పేషెంట్ ని అడిగారు మంత్రి హరీష్. వైద్యంతో పాటు అన్నిసేవలు బాగున్నాయని సదరు మహిళ సమాధానమిచ్చింది. దీంతో ఆమె మాటలు వినమంటూ మంత్రి హరీష్ రాజాసింగ్ ను సూచించారు. వైద్యం, మందులు బాగానే అందుతున్నాయని ఈ పేషెంట్స్ చెప్పిన మాటలు అసెంబ్లీలో చెప్పాలని రాజాసింగ్ కు చెప్పారు. ఇలా  మంత్రి హరీష్ బిజెపి ఎమ్మెల్యేతో సరదాగా ఆటపట్టించేలా మాట్లాడటం నవ్వులు పూయించింది.