Jul 31, 2022, 1:19 PM IST
హైదరాబాద్ : ఇంటి పరిసరాల్లో నిలిచే వర్షపు నీటితో సీజనల్ వ్యాధులు వ్యాపించే ప్రమాదం వుంటుంది... కాబట్టి పరిసరాలను శుభ్రం చేసుకుంటూ వుండాలని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రజలకు సూచించారు. ఇలా కేవలం పరిసరాల పరిశుభ్రత గురించి సూచనలివ్వడమే కాదు అందరికీ ఆదర్శంగా నిలిచేలా తానే స్వయంగా ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకున్నారు మంత్రి హరీష్. ముఖ్యంగా డెంగ్యూ నివారణ కోసం మొక్కల తొట్టెలను క్లీన్ చేసారు. అలాగే వాటిచుట్టూ నీరు నిల్వవుండకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇలా ఇంటి పరిసరాల శుభ్రంకోసం సెలవురోజయిన ప్రతి ఆదివారం కేవలం పది నిమిషాలు కేటాయించాలని... తద్వారా దోమలను నివారించి డెంగ్యూను అరికట్టాలని మంత్రి హరీష్ సూచించారు.