Telangana News: జహిరాబాద్ గల్లీల్లో సైకిల్ పై మంత్రి హరీష్ చక్కర్లు

Apr 19, 2022, 11:28 AM IST

జహిరాబాద్: తెలంగాణ ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్ రావు ఇవాళ (మంగళవారం) సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో పర్యటించారు. మంత్రి వెంట మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వున్నారు. పట్టణంలోని పలు కాలనీల్లో సైకిల్ పై తిరుగుతూ మహిళలు, స్థానికులను అడిగి సమస్యలు తెలుసుకున్న మంత్రి వాటి పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలిచ్చారు. ఇలా నగర బాటలో పేరుతో పట్టణాల్లో పర్యటిస్తూ ప్రజలకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్.