Oct 29, 2022, 9:32 AM IST
కరీంనగర్ : మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న మంత్రి గంగుల కమలాకర్ వాహనాన్ని చౌటుప్పల్ వద్ద, సంస్థాన్ నారాయణపురం వద్ద రెండు చోట్లా సాధారణ తనిఖీల్లో బాగంగా పోలీసులు, కేంద్ర బలగాలు చెక్ చేశారు, తనిఖీల సమయంలో పోలీసులకు పూర్తిగా మంత్రి గంగుల కమలాకర్ సహకరించారు, కారు లోని అన్ని బ్యాగులను మంత్రి వ్యక్తిగత సిబ్బందితో తెరిపించి తనిఖీ చేసిన అనంతరం సహకరించిన మంత్రికి పోలీసులు ధన్యవాదాలు తెలియజేశారు.