Dec 18, 2022, 12:47 PM IST
కరీంనగర్ : వైఎస్సార్ టిపి, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు వైఎస్ షర్మల, కేఏ పాల్ ఇద్దరూ బిజెపి వదిలిని బాణాలేనని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణ వనరులు, సంపదను దోచుకునేందుకు సమైక్యవాదులు మరోసారి పాదయాత్రల పేరిట దాడులు చేస్తున్నారన్నారు. ఇలాంటి వారినుండి రాష్ట్రాన్ని కాపాడే రక్షకుడు కేసీఆర్... తెలంగాణలో అభివృద్ది ఇలాగే కొనసాగాలంటే ఆయనకు అండగా నిలవాలని గంగుల సూచించారు.
కరీంనగర్ కలెక్టరేట్ లో జరిగిన కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను పంపిణీ కార్యక్రమంలో మంత్రి గంగుల పాల్గొన్నారు. ఈ సందర్భంగా 92 మంది లబ్దిదారులకు 92 లక్షల విలువగల చెక్కులను మంత్రి పంపిణీ చేసారు.