Sep 3, 2019, 1:04 PM IST
గతంతో పోలిస్తే ఫీవర్ ఆసుపత్రిలో సౌకర్యాలు మెరుగుపడ్డాయని తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అభిప్రాయపడ్డారు. సీజన్ ఒకేసారి మారడంతో వైరల్ ఫీవర్స్ వస్తున్నాయని ఆయన చెప్పారు.
మంగళవారం నాడు ఫీవర్ ఆసుపత్రిని మంత్రి ఈటల రాజేందర్ పరిశీలించారు.ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను ఆసుపత్రిలో సౌకర్యాలను ఆయన అడిగి తెలుసుకొన్నారు. గతంలో ఓపీల కంటే ప్రస్తుతం ఓపీల సంఖ్య ఆరుకు పెంచినట్టుగా ఆయన చెప్పారు. వైరల్ పీవర్ కు గురైన రోగులకు సంబంధించిన సమాచారాన్ని సీఎం కేసీఆర్ ప్రతి రోజూ తెలుసుకొంటున్నట్టుగా ఆయన చెప్పారు.
ప్రతి ఆసుపత్రి నుండి కూడ తమకు ఈ సమాచారం వస్తోందని ఆయన చెప్పారు.