వరంగల్ లో బిజెపి సభ అట్టర్ ప్లాప్...: మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు

Aug 28, 2022, 2:00 PM IST

వరంగల్ : తెలంగాణ బిజెపి అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్ ప్రజాసంగ్రామ పాదయాత్ర మూడో విడత ముగింపు సదర్భంగా వరంగల్ లో నిర్వహించిన బహిరంగ సభ అట్టర్ ప్లాప్ అయ్యిందని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పేర్కొన్నారు. లక్షమందితో భారీ సభ అంటూ బిజెపి నాయకులు ప్రచారం చేసుకున్నారు... కానీ వచ్చింది 20-30 వేల మందేనని మంత్రి అన్నారు. కొండంత రాగం తీసి ఏదో పాటు పాడినట్లు బిజెపి సభ కూడా తుస్సుమందని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. ఇక సభలో మాట్లాడిన బిజెపి జాతీయాధ్యక్షుడు జెపి నడ్డా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్ పై ఎర్రబెల్లి విరుచుకుపడ్డారు. అసలు తెలంగాణకు కేంద్రంలో అధికారంలో వున్న బిజెపి ఏం ఇచ్చిందని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తున్నందుకే సీఎం కేసీఆర్ ను ఇంట్లో కూర్చోబెట్టాలా అని బిజెపి నాయకులను ఎర్రబెల్లి నిలదీసారు.