సీఎం కేసీఆర్ కూతురు ఇంటిపై బిజెపి దాడి... కవితను పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి

Aug 24, 2022, 5:15 PM IST

హైదరాబాద్ : డిల్లీ సంబంధాలున్నట్లు ఆరోపిస్తూ సీఎం కేసీఆర్ కూతురు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బిజెపి శ్రేణులు దాడిచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పేర్కొన్నారు. ఇవాళ(బుధవారం) హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కవిత ఇంటికి వెళ్లిన మంత్రి దాడి గురించి అడిగి తెలుసుకున్నారు. ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడి పట్ల విచారం వ్యక్తం చేస్తూ కవితకు సంఘీభావం తెలిజేసారు మంత్రి ఎర్రబెల్లి. ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డి, టి.ఎస్ రెడ్కో చైర్మన్ సతీష్ రెడ్డి తదితరులు కూడా మంత్రితో కలిసి కవితను పరామర్శించారు.