కరోనావేళ.. మనవరాలితో మజా.. టేబుల్ టెన్నిస్ ఆడుతూ.. ఎర్రబెల్లి దయాకర్ రావు

Apr 25, 2020, 2:46 PM IST

ఎప్పుడూ ప్రభుత్వ పథకాలు, వాటి రూప కల్పన, అమలు - ప్రజలు, ప్రజాసేవ వంటి కార్యక్రమాల తో బిజీ బిజీ గా ఉండే రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కరోనా వైరస్ విస్తృతి లాక్ డౌన్ సమయంలో ఆట విడుపు ప్రదర్శించారు. హైదరాబాద్ లోని తన ఇంట్లో మనుమరాలు తన్వి తో టేబుల్ టెన్నిస్ ఆడారు. పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ వచ్చిన మంత్రి తన కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. ఇందులో భాగంగా శనివారం తన మనుమరాలు తన్వి తో కలిసి టేబుల్ టెన్నిస్ ఉత్సాహంగా ఆడారు.