బోనమెత్తిన మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు...

Dec 11, 2022, 3:35 PM IST

జనగామ : తెలంగాణ మంత్రి ఎర్రబల్లి దయాకరరావు సొంత నియోజకవర్గం సొంత నియోజకవర్గం పాలకుర్తిలో సందడి చేసారు. కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామంలో బొడ్రాయి పునః ప్రతిష్ట మహోత్సవానికి హాజరై గ్రామ ప్రజలతో కలిసి మంత్రి బోనమెత్తారు. బొడ్రాయి పండగ సందర్భంగా గ్రామస్తులు కోలాటాలతో, అమ్మవారి బోనాలతో మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. బొడ్రాయి పూజ అనంతరం మంత్రి ఎర్రబెల్లి కాలినడకన ఊరు చివర్లో ఉన్న దుర్గామాత గుడి వరకు గ్రామస్తులతో కలిసి వెళ్లి శంకుస్థాపన చేశారు.