చిల్డ్రన్స్ డే స్పెషల్... చిన్నారులతో సరదాగా గడిపిన మంత్రి ఎర్రబెల్లి

Nov 14, 2022, 4:47 PM IST

వరంగల్ : చిల్డ్రన్స్ డే సందర్భంగా  తెలంగాణ పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు నేడు జనగామ జిల్లా దేవరుప్పల మండలంలో పర్యటించారు. మండలకేంద్రంలోని కస్తూర్భా పాఠశాలతో పాటు మరో గవర్నమెంట్ స్కూల్లో జరిగిన చిల్డ్రన్స్ డే వేడుకల్లో పాల్గొన్న మంత్రి చిన్నారులతో సరదాగా గడిపారు. ప్రత్యేక వేషధారణలో వచ్చిన విద్యార్థులకు స్వీట్లు పంచిన మంత్రి చిన్నారులతో కేక్ కట్ చేయించారు. ఇలా పిల్లలతో కలిసిపోయిన మంత్రి కాస్సేపు సరదాగా గడిపారు.