Nov 8, 2022, 5:23 PM IST
వరంగల్ : కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పులుమోసి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని బండి సంజయ్ తాకట్టుపెట్టాడని రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మండిపడ్డారు. కానీ మునుగోడు ప్రజలు మాత్రం ఆత్మగౌరవాన్ని కాపాడుకుని టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకున్నారని... తద్వారా దేశ రాజధాని డిల్లీ వరకు తెలిసేటట్లు బిజెపికి చెప్పుతో కొట్టినట్లు ఓడించారని అన్నారు. హైదరాబాద్ లో ఎన్నికలుంటే భాగ్యలక్ష్మి టెంపుల్, వరంగల్ లో వుంటే భద్రకాళి ఆలయం, మునుగోడులో వుంటే యాదాద్రి దేవాలయం... ఇలా దేవుళ్ల పేరుతో బిజెపి నాటకాలాడుతుందన్నారు. కానీ ప్రజలు వీరి నాటకాలను గుర్తించారని... అందువల్లే మునుగోడులో ఓడించారని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు.