Apr 24, 2020, 5:11 PM IST
కరోనా నియంత్రణ లో నిరంతరం శ్రమిస్తున్న శానిటేషన్, ఎంటమాలజి, డి ఆర్ ఎఫ్ సిబ్బందికి సంఘీభావం తెలుపుతూ చార్మినార్ వద్ద ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్ తో పాటు పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అర్వింద్ కుమార్, జి హెచ్ ఎం సి కమీషనర్ లోకేష్ కుమార్, ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. కరోనా వైరస్ పై ప్రభుత్వం, జి హెచ్ ఎం సి పోరాడుతుందని, ప్రజలు ఇండ్లలోని ఉండి, సహకరించాలని మేయర్ బొంతు రామ్మోహన్ కోరారు.