Aug 13, 2021, 3:55 PM IST
కరీంనగర్: దళిత బందు పథకం మొదటగా మానకొండూర్ నియోజకవర్గంలోనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ధర్నాకు దిగారు. తిమ్మాపూర్ మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నాయకులు ధర్నా, రాస్తారోకో చేపట్టారు.స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వెంటనే రాజీనామా చేయాలని కూడా కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మనకొండూరు అభివృద్ధి జరగాలంటే ఎమ్మెల్యే రసమయి రాజీనామే ఉత్తమ మార్గమన్నారు కాంగ్రెస్ నాయకులు.