Jan 11, 2021, 2:14 PM IST
జగిత్యాల జిల్లాలో ఘోరం జరిగింది. మల్యాల మండలంలోని నూకపల్లిలో జగిత్యాల-కరీనంగర్ ప్రధాన రహదారిపై ఉన్న 130 కేవీ కరెంట్ టవర్‌కు ఉరివేసుకుని గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైటెన్షన్ విద్యుత్ లైన్ కావడంతో మృతదేహం పూర్తిగా కాలిపోయింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కిందికి దించారు. పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు పంపించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.