Nov 25, 2019, 12:42 PM IST
హైద్రాబాద్ సమీపంలోని శంషాబాద్ బూరుగుగడ్డ వద్ద సోమవారం ఉదయం ఎల్‌పీజీ గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడింది. చెన్నై నుండి హైద్రాబాద్‌కు ఎల్పీజీ గ్యాస్ లోడుతో వస్తున్న ట్యాంకర్ బూరుగుగడ్డ వద్దకు వచ్చిన సమయంలో డివైడర్ ను ఢీకొని రోడ్డుపైనే బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్యాంకర్ డ్రైవర్ గాయపడ్డాడు.