Apr 3, 2020, 4:39 PM IST
లాక్ డౌన్ లో పోలీసుల పటిష్ఠ బందోబస్తు చర్యలతో శుక్రవారంనాడు కరీంనగర్ లోని రోడ్లన్ని నిర్మానుష్యంగా మారాయి. సాయంత్రం 07గంటల నుండి ఉదయం 06 గంటల వరకు కర్ఫ్యూ నడుస్తోంది. ఈ సమయంలో రోడ్లపైకి వచ్చే వాహనాలను సీజ్ చేస్తున్నారు. కరొనా వైరస్ వ్యాప్తి కి సామాజిక దూరం పాటించడమే ప్రధాన నిరోధక చర్య అని కరీంనగర్ పోలీస్ కమిషనర్ విబి కమలాసన్ రెడ్డి అన్నారు. బందోబస్తు విధుల్లో ఉన్న వివిధ విభాగాలకు చెందిన పోలీసులకు తమ వంతు సహకారాన్ని అందించేందుకు ముందుకు వచ్చిన వాలంటీర్ల సేవలు సత్ఫలితాలనిస్తున్నాయని తెలిపారు.