Apr 21, 2020, 10:38 AM IST
లాక్ డౌన్ మనుషుల్ని బోన్లలో కట్టిపడేస్తే వన్యప్రాణులకు స్వేచ్ఛను ప్రసాదించింది. మనిషనే మృగం కనిపించకపోవడంతో కాంక్రీట్ జంగిల్ లోనూ అవి నిశ్చింతగా తిరుగుతున్నాయి. తాజాగా ఓ చిరుత రోడ్డు దాటుతూ సిసి కెమెరా కంటికి చిక్కింది, అయితే ఈ వీడియో కేబీఆర్ పార్క్ దగ్గరిదని పుకార్లు వచ్చాయి. అలాగే వీడియో వైరల్ అయింది. మరికొందరు తిరుపతిలోది అని కూడా అంటున్నారు. అయితే మూడు రోజుల కిందట జరిగిందిగా చెబుతున్న ఈ వీడియో కేబీఆర్ పార్కు ది కాదని తెలంగాణ ప్రభుత్వం ధృవీకరించింది. ఏదేమైనా ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.