Nov 2, 2022, 10:27 AM IST
నల్గొండ : ఉపఎన్నిక ప్రచారానికి చివరిరోజు కావడంతో మునుగోడులో విస్తృతంగా పర్యటించి బాగా అలసిపోయి వుంటారు. మంత్రిగా, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బిజీగా వుంటారు. అయినా ఓ రోడ్డుపై గాయాలతో పడివున్న మహిళను చూసి ఆ అలసటను మరిచి, బిజీ పనులను పక్కనపెట్టి మానవత్వాన్ని చాటుకున్నారు ఐటీ మంత్రి కేటీఆర్. గాయాలపాలై రోడ్డుపై సాయం కోసం ఎదురుచూస్తున్న మహిళను చూసి చలించిన కేటీఆర్ వెంటనే తన కాన్వాయ్ ని నిలిపి ఆమెవద్దకు వెళ్లారు. ఆమె పరిస్థితిని అడిగి తెలుసుకున్న మంత్రి తన కాన్వాయ్ లోని ఓ కారులో దగ్గరుండి ఎక్కించి హాస్పిటల్ కు తీసుకుని వెళ్లాలని సూచించారు. ఇలా రాజకీయాల కంటే మనిషులు, మానవత్వమే తనకు గొప్పవని చాటిచెప్పారు కేటీఆర్.