ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్, మునిసిపల్ శాఖ మంత్రి కేటిఆర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో కరోనా వైరస్ అదుపు చేయటానికి అనుసరించవలసిన వ్యూహం, ప్రస్తుత స్థితిగతుల పైన సమావేశం కొనసాగుతుంది. ప్రగతి భవన్ లో జరుగుతున్న ఈ ఉన్నత స్థాయి సమావేశంలో చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, డీజీపి మహేందర్ రెడ్డి, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతి కుమారి, మునిసిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్,హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు,డైరెక్టర్ పబ్లిక్ హెల్త్, డైరెక్టర్ EVDMలు పాల్గొన్నారు.